రాశి ఫలాలు OCT-2010

గ్రహ స్థితులు

అక్టోబర్ లో సాట్రన్ లో వర్గో, పీసెస్ లో జూపిటర్, కేతు జెమినిలో, రాహు సాజిటేరియస్, మెర్కురీ మరియు సన్ వర్గో లో,17వ తేదీ తరువాత లిబ్రా లో వుంటాయి.
మార్స్ లిబ్రాలో, 19వ తేదీ తరువాత మార్స్ స్కార్పియొ లో ప్రవేసిస్తుంది. వీనస్ లిబ్రాలో ప్రవేసిస్తుంది.

వి . కుమార్ ,
ఈ – మెయిల్ : VKUMAR669@GMAIL .COM

మేషం :- 21 Mar- 20 Apr
ఖర్చుల విషయంలో జాగ్రత్త గా వ్యవహరించాలి. కొన్ని విలువైనవి పొందుతారు. గెట్టుగెదర్ పార్టీ, ఈవెంట్స్ లో పాల్గొంటారు. ఓవరాల్ గా నెల రెండో వారం నుంచి బావుంటుంది. అనుకూలమైన మార్పులు జరుగును. ప్రేమ వ్యవహారాల్లో-ఇంట్లో వారి వ్యవహారాల్లో జాగ్రత్తగా డీల్ చెయ్యాలి.

అనుకులమైన తేదీలు : 18 , 20 , 28 , 29 , 30 .

వృషభం :- 21 Apr- 21 Mar

కొన్ని అనుభవములు-క్రోత్త ఆలోచనలతో పనుల్లో సంత్రుప్తి చెందుతారు. మీలోని ఆసక్తి(హాబీస్) ప్రోత్సహించుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయాలి. ఆర్దికంగా మిశ్రమ పరిస్తితులు. తొందరపడకుండా ఓర్పుగా వ్యవహరించాలి. ఆధ్యాత్మికత, భక్తి భావనలు మేలు చేయును.

అనుకూలమైన తేదీలు :- 17 , 24 , 25 , 27 .

మిథునం :- 22 May- 21 june
ఆలోచనా విదానాల్లో మంచి కాన్ ఫిడెన్సెతో వ్యవహరిస్తారు. అనవసరమైన వ్యవహారాలు వాయిదా వేయాలి. తొందరపడకుండా ఓర్పుగా విషయాల్ని అర్ధం చేసుకోవాల్సిన సమయం ఇది. ముఖ్యమైన ‘ నిర్ణయాలు ‘ ‘ ఖర్చుకి ‘ సంభందించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

అనుకూలమైన తేదీలు :- 15 , 17 , 18 , 24 , 25 , 27 , 28 .

కర్కాటకం :-22 June – 22 July

ఇతరుల తో వ్యవహారాల్లో జాగ్రత్త అవసరము. ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద పనికిరాదు. పరిస్తితుల్ని అర్ధం చేసుకొని జాగ్రత్త గా వ్యవరించాలి. రాబడిని ద్రుష్టిలో వుంచుకొని ఖర్చు నిర్ణయించుకోవడం క్షేమము. ఓవరాల్ గా బానే వుంటుంది.

అనుకూలమైన తేదీలు :- 17 , 18 , 19 , 20 , 28 , 29 , 30 .

సింహం :- 23July – 23 Augu

మీకు మీరే రియలైజ్ అవ్వాల్సిన అవసరముంటుంది. ఓర్పుగా వ్యవహారాల్ని నడిపించండి. పరిస్తితుల్ని బాగా అర్ధం చేసుకొని సమయానుకూలంగా మాత్రమే నిర్ణయాలు చేయవలసి వుంటుంది. చంచలమైన భావాలతో అనారోగ్యస్తితికి చేరకుండా జాగ్రత్త పడాలి. మిశ్రమ ఫలితాలుంటాయి, తొందరపడకూడదు.

అనుకూలమైన తేదీలు :- 18 , 19 , 20 , 28 , 29 , 30 .

కన్యా :-24 Augu – 23 Sep

ఏ విషయాల్లో ఆశ్రద్ద పనికిరాదు. ఆలోచనలు-మాటలు వ్యవహారశైలిలో మంచి మార్పులు అవసరము. వ్రుత్తి/ఆర్దిక రాబడి సంభందించిన విషయాలు బావుంటాయి. మీ ‘ మంచి ఆలోచనలు ‘ ఎందరికో వారి రోటీన్ లైఫ్ లో మార్పులకు కారణమవును. మంచి దైవ చింతనలు మానసిక శాంతినిచ్చును.

అనుకూలమైన తేదీలు :- 17 ,18 , 24 , 25 , 27 , 28 .

తులా :- 24 Sep – 23 Oct
మంచిగ్రహింపు ఓర్పులతో వ్యవహారాల్లో అనుకూలతలు పొందుతారు. గ్రుహ/ఆర్దిక/వ్యాపార వ్యవహారాలు బావుంటాయి. మంచి అనుకూల/ఉత్సాహకరమైన వాతావరణంతో సంతోషం చెందుతారు. విలువైనవి సమకూర్చుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరము.

అనుకూలమైన తేదీలు :- 17 , 24 , 25 , 27 .

వృశ్చికం :- 24 Oct – 22 Nov

చాలా విషయాల్లో అనుభవపూర్వకమైన సంత్రుప్తిని పొందుతారు. రియలైజ్ అవుతారు. శ్రమ వ్రుదాకాకుండా జాగ్రత్త గా ప్లాన్ చేసుకోవడం అవసరము. అన్ని వ్యవహారాల్లొ రహస్య ధోరణి అవసరము. ఓవరాల్ గా చాలా విషయాల్లో అనుకూలమైన వాతావరణం కనిపించును. .

అనుకూలమైన తేదీలు :- 17 , 18 , 19 , 20 , 26 , 28 , 29 , 30.

ధనుస్సు: 23 Nov -21 Dec

మంచి వ్యవహార పరిణితితో వుంటారు. పేరు ప్రఖ్యతులు చెందినవారితో పరిచయాలు కలుగును. ఆర్దిక రాబడి బావుంటుంది. ఆలోచన వుద్రేకములు అదుపు చేసి ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చేయకుండా జాగ్రత్త పడాలి. కొందరి ‘ పరిచయాలు ‘, సహాయములు మర్చిపోలేరు.
ముఖ్యమైన నిర్ణయాలు, మాట్లాడే విషయాల్లో తొందరపనికిరాదు. ఓవరాల్ గా బావుంటుంది.
అనుకూలమైన తేదీలు :- 18 , 19 , 20 , 24 , 27 ,28 ,29 , 30.

మకరము :- 22 Dec -20 Jan

అనవసరమైన వాదనలు అవాయిడ్ చేయాలి. ఇతరుల విషయాలు గ్రహించడం వరకే ప్రాముఖ్యతనిచ్చి మీ సొంత ఆలోచన తెలివి తేటల్ని ఉపయోగించాలి. ఏ వ్యవహారాల్లోనూ నిర్లక్ష్యపు దోరణి పనికిరాదు. కష్ట నష్టాలికి దూరంగా వుండండి. ఓవరాల్ గా రెండవ వారం నుంచి అనుకూలము.

అనుకులమైన తేదీలు : 17 , 24 , 25 ,27.

కుంభ : 21 Jan – 18 Feb

తొందరపడకుండా ఓర్పుగా వ్యవహరించాలి. అనవసరమైన వాదనలు అవాయిడ్ చేయాలి. ఇతరుల తో జాగ్రత్త గా వ్యవహరించాలి.  రెండవ వారం నుంచి అనుకూలమైన పరిస్తితులు. మీ ఆలోచన పరిది పెరిగి మంచి సర్కిల్స్ లో సోషల్ గా మూవ్ అవుతారు. తొందరపడి ఏ నిర్ణయము తీసుకోకూడదు.

అనుకులమైన తేదీలు :- 17 , 24 , 25 ,27 .

మీనము: 19 Feb – 20 Mar

క్రొత్త ఆలోచనలు ప్రయత్నాలు కలసివస్తాయి. మంచి అనుకూల మార్పులు వుంటాయి. ఆలస్యమైనప్పటికీ ఫలితం బావుంటుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం అంత క్షేమం కాదు. ఆరోగ్య – ఆలొచన స్తితుల్లో ఆశ్రద్ద పనికిరాదు.

మీకు అనుకులమైన తేదీలు :- 17 , 18 , 19 ,24 , 27 , 28 , 30 .