త్రిష, రవితేజ కాంబినేషన్ మళ్ళీ


triasha-ravi

కిక్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ తదుపరి చిత్రంలో తాజాగా మొదట అనుకున్న అనూష్క పేరులో త్రిష వచ్చి చేరింది. అంతకుముందు హీరో గోపిచంద్ ని అనుకొని ఆ తర్వాత రవితేజను తీసుకున్నారు. డాన్ శీను అనే వర్కింగ్ టైటిల్ తో తయారవుతున్న ఈ స్క్రిప్టును కోనవెంకట్ రెడీ చేస్తున్నారు. పిబ్రవరి 2009 నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. ఇక అనూష్కను మార్చటం వెనుక గోపీచంద్ తో అయితే ఆమె పెయిర్ బాగుంటుందనుకున్నారు. అయితే రవితేజ సీన్ లోకి వచ్చాక త్రిషను అనూష్క ప్లేసులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు రవితేజ,త్రిష కాంబినేషన్లో కృష్ణ చిత్రం వచ్చి హిట్టయింది. ఇక త్రిష నటించిన వెంకటేష్, బ్రహ్మానందం ప్రదాన పాత్రలు పోషించిన నమో వెంకటేశ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.

 


Pages:

Leave a Reply