కాజల్ తో చైతన్య అమెరికా ట్రిప్


కొత్త దర్శకుడి దర్శకత్వం లో ‘జోష్’ తో తెరంగేట్రం చేసిన నాగ చైతన్య ,తన రెండవ సినిమా ‘ఏ మాయ చేసావె ‘,అనుభవజ్ఞుడైన గౌతమ్ మీనన్ తో చేశాడు. ఆ  సినిమా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఇప్పుడు మళ్లీ తన మూడవ సినిమా , అజయ్ భుయాన్ అనే మరొక కొత్త దర్శకుడి తో చేయనున్నాడు. కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై డి. శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సినిమాటోగ్రఫీ ,వి.ఎస్. జ్ఞానేశ్వర్.  కాజల్ కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రం ఎక్కువగా అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఈ నెలాఖరుకి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.


Pages:

Leave a Reply