అల్లు అర్జున్ ‘వరుడు ఆడియో ‘రిలీజ్
Mon, Mar 8 2010స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘వరుడు ఆడియో ‘రిలీజ్ వేడుక మార్చి,7 న హైదరాబాద్ లోని రమాణైదు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ప్రసిద్ధ సినీ గేయ రచయిత శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి, ఈ చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ,దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, గుణశేఖర్,నిర్మాతలు డి.సురేష్ బాబు,డి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి…తదితర అతిధులంతా ‘పెళ్లి కొడుకు’ గెటప్ లలో ప్రేక్షకులందరిని అలరించారు.
ఎస్.ఎస్. రాజమౌళి సి.డి లు విడుదల చేసి అల్లు ఆరవింద్ కి మొదటి కాపీ అందించగా, క్యాసెట్లను డి.శివ ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ” దర్శకులు గుణ శేఖర్ ఈ చిత్రంలో ప్రతి పాత్రను జాగ్రత్తగా మలిచే బాధ్యతను తన భుజాల మీదికి ఎత్తుకున్నారుంఒత్తమ్ క్రెడిట్ ఆయనకే చెన్దుతున్ది. వేటూరి ,మణిశర్మ గార్ల కలయిక ఈ చిత్ర స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లింది. అందుకే ఈ వేడుకని సంగీత ,సాహిత్య పండుగ గేయా జరుపున్కున్తున్నము.ఈ సినిమా విడుదలకు ముందే ఆడియో ‘వరుడు’ చిత్ర ఘన విజయానికి బాటలు వేస్తుందని నాకు నమ్మకముంది.”
దర్శకులు గుణ శేఖర్ మాట్లాడుతూ” సాంప్రదాయమైన వివాహ వ్యవస్థ గట్టిగా నిలబడ్దప్పుడే బలమైన సమాజం ఏర్పడుతుంది. రోజు రోజుకి మనం మన సాంప్రదాయాలను కోల్పోతున్నాం. ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి మన సంస్కృతులను మరిచిపోతున్నాం. ఆది గుర్తు చేయడానికే ఈ సినిమా చేశాం. ఇంత మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాకి దర్శకత్వమ్ వహించే అవకాశం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది”.
ఈ చిత్ర నిర్మాత అయిన డి.వి.వి దానయ్య మాట్లాడుతూ,” మేము ఇంతవరకు ఈ సినిమా హీరోయిన్ పేరు కానీ ఫోటోలను కానీ బయట పెట్టలేదు ఎందుకంటే ,ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఒకేసారి తనని సినిమాలో చూస్తే బాగుంటుందని అనుకోవడమే కారనమ్.ఈ నెల 26 న “వరుడు” విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నాం.
Pages:




