పెద్దలు కుదిర్చిన పెళ్ళే: బన్నీ
Mon, Mar 8 2010ఒక ధనవంతురాలైన అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నట్టు తన పై పుట్టుకొస్తూన్న పుకార్లన్నిటినీ అల్లు అర్జున్ పటా పంచలు చేసాడు. ఇంతకు ముందొక సారి కూడా హైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో పడ్డట్లు మీడియా లోని ఒక వర్గం వారు అల్లు అర్జున్ పైన పుకార్లు షికార్లు చేయించారు. వాటన్నిటికి సమాధానంగా, తన జీవితంలో ప్రస్తుతం ఏ అమ్మాయీ లేదని బన్నీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. తనకు తల్లిదండ్రులు సరైన అమ్మాయినే చూసి పెళ్లి చేస్తారని,కాబట్టి తనది నిస్సందేహంగా పెద్దలు కుదిర్చిన వివాహమే అని చెప్పాడు.
బన్నీకి తన కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలో ఏమిటో అన్న దాని గురించి ఒక చిన్న సైజు కోరికల చిట్టా ఉంది. అమ్మాయి అప్సరస లాగా ఉండాలట, సిటీ కల్చర్ బాగా వంటబట్టి ఉండాలట. అన్నిటి కంటే ముఖ్యంగా కుటుంబ విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలట.
అమ్మాయిలూ చూసారుగా….ఆ అర్హత లన్నీ మీలో ఎవరికైనా ఉంటే ఓ సారి ప్రయత్నించి చూడండి… ఏమో ఎవరికి తెలుసు ఈ ఏకైక స్టైలిష్ ‘వరుడి’కి “వధువు” అయ్యే అవకాశం, అదృష్టం మీదేనేమో?
Pages:




