చిరుకలను నిజంచేసుకున్న బాలయ్య
Tue, Mar 9 2010
సినిమాల మీద కనీస అవగాహన ఉన్న ఎవరైనా చెప్తారు …చిరంజీవి తన 150 వ సినిమాగా “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” చెయ్యాలనుకున్నాడని. ఆ సినిమాకి తనే దర్శకత్వం చేయాలని కూడా ఎన్నో కలలు కన్నాడు. కానీ, ప్రస్తుతం తాను రాజకీయాల్లో ఉన్నందున ఆది తీరని కలగానే మిగిలి పోయింది. ఎప్పటికైనా చిరు మళ్లీ సినిమాల్లోకి వస్తాడని ,తన కలల ప్రాజెక్ట్ అయిన “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి” గా తెరమీద మెరుస్తాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
అప్పటిదాకా మరి”ఉయ్యాల వాడ…పాత్ర చిరు కోసం ఆగుతుందా అంటే,లేదంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే,ఇప్పటికే ఆ పాత్ర బాలయ్య ఒళ్ళో వాలిపోయిందని సమాచారం. ప్రముఖ దర్శకుడు, జయంత్ .సి. పరాంజీ ఈ సినిమాని తన స్వంత బ్యానర్ పై దర్శకత్వం వహిస్తాడని, ఈ ‘మెగా’ ప్రాజెక్ట్ ఇక ‘మెగాస్టార్’చేతిలో నుండి జారిపోయిందని విశ్వసనీయ సమాచారం. ఈ సస్పెన్స్ వీడాలంటే , ఆ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడే దాకా ఆగాల్సిందే.
Pages:



