మార్చి31న వరుడు వస్తున్నాడు


అల్లు అర్జున్‌ హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వంలో యూనివర్శల్‌ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ‘వరుడు’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 31న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధిందించి బ్యాలెన్స్‌ వున్న పాటను మార్చి 12నుంచి అల్లు అర్జున్‌, హీరోయిన్‌, 50మంది డ్యాన్సర్లపై చిత్రీకరి స్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత డి.వి.వి. దానయ్య మాట్లాడుతూ ‘‘ఖమ్మం దాటి వచ్చేసాక గుమ్మం తొక్కి తలుపెయ్యాలా.. ఓరుగల్లే ఓడించాక ఒయ్యారాలే దులిపెయ్యాలా..’ అనే పాటను అమ్మ రాజశేఖర్‌ నృత్య దర్శకత్వంలో భారీ సెట్స్‌లో హీరో, హీరోయిన్‌, 50మంది డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్నాం. ఈ పాటతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 31న చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ఆడియో పెద్ద హిట్‌ అయింది. అన్ని ఏరియాల్లో బిజినెస్‌ బాగుంది. సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది’’ అన్నారు.

ఇతర పాత్రల్లో సుహాసిని, నరేష్‌, ఆశిష్‌ విద్యార్ధి, షాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్‌, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్‌ ప్రసాద్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, పాటలు: వేటూరి, ఛాయాగ్రహణం: ఆర్‌.డి. రాజశేఖర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఆర్ట్‌: అశోక్‌, ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గుణశేఖర్‌.


Pages:

Leave a Reply