త్రిష సర్వం” సన్నద్ధం
Wed, Mar 17 2010
ఆర్య, త్రిష, జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన సర్వం చిత్రాన్ని అదే పేరుతో సింహపురి టాకీస్ పతాకంపై తెలుగులో అనువదిస్తున్నారు నిర్మాత యం.రఘునాథ్. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ మా మొదటి చిత్రం అనంతపురం 1980’ విజయవంతంగా నడిచి మా బేనర్‌కు మంచి గుర్తింపు తెచ్చింది.
“సర్వం” చిత్రం గత ఏడాది తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రానికి యువన్ శంకర్‌రాజా అందించిన సంగీతం ఎస్సెట్ అయింది. జె.డి.చక్రవర్తి నటన ఈ చిత్రానికే హైలైట్. ఈ నెలలోనే ఆడియో విడుదల చేసి ఏప్రిల్‌లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్, యాక్షన్: త్యాగరాజన్, దర్శకత్వం: విష్ణువర్ధన్, నిర్మాత: యం.రఘునాథ్.
Pages:



