నడి సంద్రంలో దారి తప్పిన త్రిష


అందాల తార త్రిష అందరికీ కాసేపు ముచ్చెమటలు పట్టించింది. దారి తప్పిపోయి అందరినీ పరుగులు పెట్టించింది. అసలు విషయమేమిటంటే, త్రిష ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా రూపొందుతోన్న “మన్మధన్ అంబు” అనే ఒక అరవ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ యూరప్ లోని ఒక సముద్రంలో జరుగుతోంది. ఒక భారీ నౌకలో జరుగుతున్న ఈ షూటింగ్ సందర్భంగా స్పాట్ లోకేషన్ మారే సమయంలో అమ్మడు తప్పిపోయింది. . ఒక వేళ పొరబాటున ఇలాగే ఎవరన్నా తప్పిపోతే ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఈ చిత్ర బృందానికి ఆ నౌకకు చెందిన సిబ్బంది షిప్ మ్యాప్ ని ఇచ్చారు. అయినా కూడా త్రిష కి ఏమీ అర్ధం కాక మొత్తానికి దారి తప్పిపోయింది. చిత్ర యూనిట్ ని కలుసుకోలేకపోయింది.

అప్పటివరకూ తన వెంటే ఉండి, ఉన్నట్టుండి అలా మాయమయ్యేసరికి త్రిష వాళ్ళమ్మ కంగారుపడిపోయింది. చివరికి సెక్యూరిటీ సాయంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు త్రిష ని ఒక షాపింగ్ మాల్ దగ్గర కనుగొన్నారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. …ఒకవేళ ఈ సుందరాంగిని వాళ్ళ అమ్మ వాళ్ళు కనుగొనడం కాస్త ఆలస్యం అయ్యుంటే…. “నడి సంద్రమున నా నావ… కరుణించుము ఓ దేవా…” అంటూ పాటలు పాడుకుంటూ కూర్చునేదేమో పాపం…త్రిష.


Pages:

Leave a Reply