… అయినా ముంబాయి మీఠా అంటున్న త్రిష
Mon, Jul 26 2010
ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన త్రిష కథానయక చేసిన “కట్టా – మీఠా” సినిమా ఆశించినంత ఫలితం రాబట్టుకోవడంలో విఫలమయింది. అయినా కూడా త్రిష చెన్నై నుండి ముంబాయికి మకాం మార్చే పనిలో ఉంది. ఇప్పటికే ముంబాయైలో త్రిష ఒక ఇల్లు కొన్నట్టు సమాచారం. కానీ, త్రిష తల్లిదండ్రులకీ మాత్రంముంబాయికి ఇల్లు మార్చడం సుతరామూ ఇష్టం లేదని వినికిడి. ఇదే విషయమై త్రిషకి ఆమె తల్లిదండ్రుల మధ్య కొంతకాలంగా తీవ్ర వాగ్యుద్ధాలు జరుగుతున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి.
ఇదలా ఉండగా తమిళం లో త్రిష నటించిన “విన్నైతాండి వారువాయ” ( తెలుగులో”ఏ మాయ చేసావె”) సినిమా ఘనవిజయం సాధించిన నేపధ్యంలో హిందీలో కూడా ఆ చిత్రాన్ని రీమేక్ చేయనున్న సంగతి విదితమే. అందులో కూడా త్రిష కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే ముంబాయిలో ఈ చిత్రానికిసంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది.
Pages:



