నాకు మళ్లీ ఆమే కావాలంటున్న హీరో


బాలీవుడ్ లో ఇటీవల “ఖట్టా మీఠా” చిత్రంతో తెరంగేట్రం చేసిన చెన్నై సుందరాంగి త్రిషకి బాలీవుడ్ లో ఒక్కో అవకాశం వెతుక్కుంటూ వస్తోంది. త్రిష నటించిన తొలి హిందీ సినిమా “ఖట్టా మీఠా” చిత్ర హీరో ఈ అమ్మడులో ఎం మెచ్చాడో తెలియదు కానీ, తన తదుపరి హిందీ చిత్రంలో కూడా నాకు త్రిష కావాలని అంటున్నాడట. తన తొలి చిత్రం ఫలితం సరిగ్గా లేకున్నా, ఏమాత్రం నిరుత్సాహపడకుండా వేరే సినిమాల్లో నటించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది త్రిష. తెలుగులో ఈ ముద్దుగుమ్మ హవా కాస్త తగ్గినప్పటికీ, తమిళ్ లో తాజాగా “జాతీయ నటుడు” కమల్ హాసన్ తో కలిసి “మన్మధన్ అంబు” అనే చిత్రంలో చేస్తోంది ఈ సుందరి. ఈ చిత్రంలో మొదటిసారి తన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అలాగే, విశాల్ సరసన మరో సినిమాలో చేయడానికి తన అంగీకారం తెలిపింది అని సమాచారం.

ఇకపోతే.. తెలుగులో కూడా.. త్వరలో ఒక పెద్ద హీరో సరసన కనబదబోతుందన్న వార్తలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా.. ఒక్క సినిమాకే… బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే అక్షయ్ కుమార్ సపోర్ట్ పొందింది.. మొత్తానికి త్రిష అక్షయ్ ని ఏం చేసి ఉంటుందో అని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు…

మీకేమైనా ఆలోచన వచ్చిందా…. మరి?


Pages:

Leave a Reply