హీరోయిన్లకు ఆ నొప్పులు తప్పవు:ఇలియానా
Wed, Aug 18 2010
టాలీవుడ్ లో బక్కపలచని నడుము గల వయ్యారి భామ ఎవరు అంటే, ఎవరైనా తక్కున చెప్పే పేరు ఇలియానా. ఎన్నో కష్టాలు పడి పెంచుకున్న సోయగాలు, గంటల తరబడి వ్యాయామాలు చేసి మలుచుకున్న ‘వంపులు’… .పాపం, మోయలేక మోస్తున్న ఈడు భారాలని కాపాడుకోవడం కోసం తానెన్నిపాట్లు పడుతుందో ఈ మధ్యన ఒక సందర్భంలో మీడియాకి చెబుతూ ” సినీ రంగంలోకి అడుగుపెట్టిన దగ్గరనుండి..కడుపు నిండా తినలేకపోతున్నాను, కంటి నిండా నిద్రపోలేకపోతున్నాను. రెండిట్లో ఏది చేసినా అధిక బరువు సమస్య తలెత్తుతుంది కదా. అందుకే వీలు చిక్కినప్పుడలా వ్యాయామాలు చేస్తుంటాను. అవి చేస్తున్నంతసేపూ ఒళ్ళంతా నొప్పులే. కానీ ఏం చేస్తాం హీరోయిన్ అన్నాక అందమైన శరీరాకృతి లేకుంటే అసహ్యంగా ఉంటుంది. అందుకే ఈ సమస్య నా ఒక్కదానిదే కాదు… హీరోయిన్ అన్న ప్రతి ఒక్కరూ ఈ నొప్పుల్ని తట్టుకోవాలి….అలవాటుపడాలి” అంటూ తన గోడునంతా ఏకరువుపెట్టింది. ఎన్ని కష్టాలొచ్చిపడ్డాయో కదా…ఈ గోవా సుందరికి. కష్టం ఆమెది… “కనువిందు” అభిమానులకి…. ఏమంటారు?
Pages:



