అవును మేమిద్దరం విడిపోయాం-సల్మాన్
Thu, Aug 19 2010
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ప్రేమాయణంలో మరొక మజిలీ ముగిసింది. ఇటీవలే ఒక టి.వి. ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్రీనా తో తాను విడిపోయాయని చెప్పాడు. గతంలో తాము ఎలాగైతే స్నేహితుల్లా ఉన్నామో, ఇప్పుడు కూడా అలానే ఉన్నాం అని అంటున్నాడు ఈ నిత్య ప్రేమికుడు…….ఎంత మాట (?).
“దబాంగ్” చిత్రంలో తన సరసన కథానాయికగా నటిస్తోన్న సోనాక్షి సిన్హా కి ప్రస్తుతం సల్మాన్ ఖాన్ “పెద్దదిక్కు” పాత్రను పోషిస్తున్నాడు. అన్నీ తనై దగ్గరుండి చూసుకుంటున్నాడు. తాను చేయబోయే కొత్త సినిమాల్లో సోనాక్షిని హీరోయిన్ గా పెట్టుకోమని దర్శక, నిర్మాతలకి సల్మాన్ సూచిస్తున్నాడట. పైగా వీరిద్దరూ సినిమాల్లో లా బయట కూడా ఈ మధ్యన చెట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని బాలీవుడ్ లేటెస్ట్ బజ్. అంటే కాకుండా…సల్మాన్ మాదిరిగానే సోనాక్షి కూడా పెయింటింగ్ బాగా వేస్తుందని సమాచారం. వీరిద్దరి ఆలోచనలు, అభిరుచులు దాదాపు అన్నీ ఒకలాగే ఉన్నాయని అమ్మడు తెగ మురిసిపోతోంది. పైగా, మన హీరోగారు కంగనా రనౌత్ తో కూడా ‘సన్నిహితంగా’ ఉంటున్నాడని బాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఏదేమైనాసల్మాన్ ఖాన్ పంచన చేరుతున్న ఈ సరికొత్త ‘బంధాల’ గురించి తెగిపోయిన పాత “అనుబంధాలు”( సంగీత బిజ్లానీ, ఐశ్వర్యా రాయ్, కత్రీనా) చూసి నవ్వుకోవడం తప్ప ఏం చేయగలరు…పాపం సోనాక్షి అంటూ…తమ లిస్టులో ఆమె చేరే వరకు ఎదురు చూడటం తప్ప…
Pages:



