అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేసిన హన్సిక
Fri, Aug 20 2010
మొఖానికి రంగేసూకునేవాళ్ళందరూ మొఖం చాటేసుకుంటూ తిరుగుతుంటారు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ అన్నమాట. వారికున్నసెలెబ్రీటీ ఇమేజ్ ఒక్కోసారి వారికి తంటాలు కూడా తెచ్చిపెడుతుంటుంది. స్వేచ్ఛగా తిరగలేరు… కాలు బయట పెడితే పది మందీ గుర్తుపడతారు… చుట్టూ గుమికూడతారు. సినీ తారలకు వ్యక్తిగత స్వేచ్ఛ దొరకడం చాలా కష్టమనే చెప్పాలి. అందుకే, చాలామంది తారలు తమకు తీరిక దొరికినప్పుడు…తమని ఎవరూ గుర్తుపట్టని సుదూర తీరాలకి వెళ్ళి సేదదీరుతుంటారు. అందుకనే ఇటీవల పాలబుగ్గల చిన్నది హన్సిక…చెన్నైకి వెళ్ళి “పీప్లీ లైవ్” చిత్రాన్ని చూసిందట. కోలీవుడ్ లో తాను ఇప్పటివరకూ ఒక్క సినిమా అకూడా చేయలేదు కనుక, అక్కడ తనని ఎవరూ గుర్తుపట్టే అవకాశం లేదులే అనుకుంది.
కానీ.. అమ్మడి అంచనాలను తలకిందులు చేస్తూ, థియేటర్లో హన్సికని చూసిన మరుక్షణమే…పదుల సంఖ్యలో అభిమానులు ఈ ముద్దుగుమ్మ చుట్టుముట్టి…ఆటోగ్రాఫుల కోసం ఎగబడ్దారట. దాంతో చేసేదేమీ లేక..ఓ పక్కన తనకు తెలియని ఊర్లో కూడా తనపై వెల్లువెత్తుతున్న అభిమానానికి లోలోనే మురిసిపోతూ, అడిగిన వాళ్ళందరికీ ఓపిగ్గా ఆటోగ్రాఫులు ఇచ్చిందట… మరికొంతమంది ఔత్సాహికులు అమ్మడుతో ఫోటోలు కూడా దిగారట.
ఇక ఈ చిన్నది తమిళ తెరపై తళుక్కుమనే రోజు ఎంతో దూరంలో లేదు అని అనొచ్చేమో….?
Pages:




madma ki akkada anta scene undaa…….koooooool.
abbo…..
mare naku
Hey blogger,search your blog from google,great blog,keep writting.promzzz