షూటింగులో కాలు విరగ్గొట్టుకున్నతార


అందాల ‘ బొద్దుగుమ్మ’ , పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ ప్రస్తుతం మహిళా ప్రాధాన్యత గలిగిన “మంగళ” చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా, ఛార్మీ కాలికి బలంగా గాయమయ్యింది అని తెలిసింది. సీన్ ప్రకారం… ఛార్మీ భయపడుతూ పరిగెట్టాలి. అలా పరిగెడుతున్న సమయంలోనే కాలు జారి కిందబడటంతో బరువంతా ఒక్క కాలిమీద పడి నేలకు తాకడంతో…కాలు విరిగిందని సమాచారం. నిజానిజాలేమిటో ఇంకా తెలియాల్సి ఉంది.

ఛార్మీ కాలికి కేవలం కొద్ది పాటి గాయమే అయ్యింది కానీ, విరగడం గట్రా లాంటివేవీ  లేవు…అన్నది మరికొందరి వాదన. ఏదేమైనా..ఇటీవల షూటింగుల్లో నటీ నటులు చాలామంది గాయపడటం రివాజైపోయింది.  గాయం చిన్నదో పెద్దదో… మొత్తానికి గాయపడ్డ ఛార్మీ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.


Pages:

6,607 Responses to “షూటింగులో కాలు విరగ్గొట్టుకున్నతార”

  1. mahi says:

    ayyo paapam chaarmee. get well soon dear…

  2. prabhu says:

    aakhariki charmi kuda kalu jarinda….shubham..

Leave a Reply