అతిలోకసుందరి చేత “అప్పలరాజు” ఓపెనింగ్


రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా “కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:అప్పలరాజు” అనే సినిమా రూపొందించబడుతోందని తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ ఈ నెల ఆగస్టు 27 న హైదరాబాదులో వైభవంగా మొదలుకానుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం “ఆతిలొకసుడ్నారి” శ్రీదేవి చేత చేయించాలని వర్మ సంకల్పించాడు. శ్రీదేవి పట్ల వర్మ కి ఉన్న అభిమానం, ఆరాధ్యభావం అందరికీ తెలిసిందే. కేవలం శ్రీదేవి కోసమే, “క్షణక్షణం”, “గోవిందా గోవిందా” సినిమాలు చేశాడు వర్మ. ఇప్పటికీ శ్రీదేవి పట్ల వర్మ కి ఉన్న అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదు. అందుకే…లేక లేక పుష్కరకాలం తరువాత వర్మ నేరుగా తెలుగులో దర్శకత్వం వహించనున్న సినిమా ప్రారంభోత్సవానికి తన ఆరాధ్య నటి శ్రీదేవిని ఆహ్వానించాడట వర్మ. శ్రీదేవి కూడా సంతోషంగా వస్తానని ఒప్పుకుంది.

“అప్పలరాజు” చిత్రంలో ఇద్దరు కథానాయికలు. ఒకరు “కలర్స్” స్వాతి కాగా, మరొక హీరోయిన్ గా ముంబాయికి చెందిన ఒక మోడెల్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. “శ్రేయ ప్రొడక్షన్స్” పతాకంపై కోనేరు కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.


Pages:

6,606 Responses to “అతిలోకసుందరి చేత “అప్పలరాజు” ఓపెనింగ్”

  1. nitya says:

    She is the real beauty…….i like her

  2. pradeep says:

    sridevi is a real “atilokasundari”…she is evergreen…always..

  3. ramu says:

    wow..good to see her back in Hyd….we’ll be waiting for u…sri..

Leave a Reply