మళ్లీ ఇన్నాళ్లకు అతనితో ఆమె


నాగార్జున నటించిన “శ్రీరామదాసు” చిత్రం విడుదలాయి నాలుగేళ్లకు పైగా అయింది. ఆ చిత్రంలో నాగార్జున అర్ధాంగిగా నటించిన స్నేహ మళ్లీ ఇన్నాళ్లకు నాగార్జున సరసన నటించే అవకాశాన్ని పొందింది. వరుస విజయాల చిత్ర దర్శకుడు రాజమౌళి తండ్రి , ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున “రాజన్న” అనే చిత్రం చేయబోతున్నాడు. ఇందులో నాగ్ సరసన కథానాయికగా స్నేహ ని ఎంపిక చేసినట్టు తెలిసింది.  నాగార్జున తన సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

“రాజన్న” కథ అంతా ఒక చిన్న పాప చుట్టూ తిరుగుతుందని తెలిసింది. ఆ పాపకి నాగ్ ఏ విధంగా సహాయపడ్డాడు, ఆ పాప కన్న కలల్ని నాగ్ ఏ విధంగా నిజం చేశాడు అనండి ప్రధాన కథ. కొసమెరుపు ఏమిటంటే…ఈ చిత్రంలోని అన్ని యాక్షన్ సన్నివేశాలని రాజమౌళి స్వయంగా రూపొందించనున్నాడట. అదే కనుక నిజమయితే…అరుదైన కాంబినేషన్‌లో వచ్చే ఆ సన్నివేశాలకి అభిమానులు మంత్ర ముగ్ధులయిపోతారు అనడంలో సందేహంలేదు….ఏమంటారు?


Pages:

Leave a Reply