సెట్స్‌లో గాయపడ్డ మరో నటి


ఇండియన్ జెన్నీఫర్ లోపెజ్ అనబడే సమీరా రెడ్డి “బుల్లెట్ ట్రెయిన్” అనే సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. అందులో భాగ్‌మాగా సమీరా మోటర్ సైకిల్ మీద వేగంగా వెళ్లాల్సిన షాట్ ఉంది. ఎటువంటి డూప్ సహాయం లేకుండా సమీరా స్వయంగా తనే మోటార్ సైకిల్ ని నడపాలని అనుకుంది.

స్టార్ట్ చేసి కొంచెం ముందుకు కదిలిందో లేదో, బండి అదుపు తప్పి ఆమె మీద పడింది.  సమీరా మెడకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలిసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.

అజయ్ దేవగన్, అనిల్ కపూర్ ఈ చిత్రంలో కథానాయికలు కాగా, సమీరా రెడ్డి,  కంగనారనౌత్ లు కథానాయికలు. బోమన్ ఇరానీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.


Pages:

Leave a Reply