వేశ్యగా మారడానికి నేను రెడీ:త్రిష


ఏం పాపం…..? అంటూ మరీ ఊహల్లో తేలిపోకండి.. ఇంతకీ ఈ చెన్నై చంద్రానికి ఏం అంత ఖర్మ పట్టింది అంటూ ఫీలైపోకండి… అసలు విషయం ఏమిటంటే, మొన్నీమధ్యన ఈ ముద్దుగుమ్మ చెన్నైలో “వేదం” సినిమాకి వెళ్ళిందంట. అందులో అనుష్క నటనను చూసి ఫ్లాట్ అయిపోయిందట.

ఈ విషయమే ఇటీవలే మీడియాకి త్రిష తెలియజేస్తూ” “వేదం” సినిమాలో అనుష్క  నటన నన్నుఎంతగానో ఆకట్టుకుంది. దక్షిణాది సినిమాల్లో టాప్ హీరోయిన్ గా ఉంటూ అలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకు అనుష్క ధైర్యాన్ని  మెచ్చుకోవాలి. ఇమేజ్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, ఆ సినిమా చూసిన దగ్గరనుండి నాకు అనుష్క, ఆమె చేసిన పాత్రలే గుర్తొస్తున్నాయి. ఇప్పటివరకు నేను అన్నీ కమర్షియల్ సినిమాలే చేశాను. నాకే కనుక కథ నచ్చి, నటనకు బాగా ఆస్కారంఉన్నపాత్ర వస్తే, చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది వేశ్య పాత్రయినా సరే” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.

పాతకాలం హీరోయిన్లు జమున, సావిత్రి, భానుమతి తదితరులు కేవలం వేశ్య పాత్రలు చేసే తమ నటనను నిరూపించుకోలేదు కదా.. “వేశ్య” పాత్రల్లోనే నటనకు ఆస్కారముంది అని గుడ్డిగా నమ్మే ఈ సుందరికి పాపం ఆ విషయం ఎప్పుడు బోధపడుతుందో ఏమిటో?


Pages:

Leave a Reply