“నేటి చరిత్ర” ఆడియో విడుదల
Wed, Sep 1 2010
చాలా కాలం తరువాత “మృగం” చిత్ర దర్శకుడు తెలుగు, తమిళ భాషల్లో హరీష్ కళ్యాణ్, అనఘ జంటగా ఒకేసారి “నేటి చరిత్ర” పేరుతో ఒక సినిమాని రూపొందిస్తున్నాడు. “గ్లోబల్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్” పతాకంపై ఫణీంద్ర కుమార్, మైకేల్ రాయప్పన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ రోజు(సెప్టెంబరు 1) సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో “నేటి చరిత్ర” ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, ‘దిల్’ రాజు, దర్శకులు శ్రీను వైట్ల, సాగర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సుందర్ .సి. బాబు ( శంభో శివ శంభో) సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆడియో సి. డి లను నిర్మాత డి. సురేష్ బాబు విడుదల చేశారు.
Pages:



