ఆ సినిమాలో నా పాత్ర సస్పెన్స్:పవన్
Wed, Sep 1 2010
నిన్న(ఆగస్టు 31) సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ఏసు క్రీస్తు జీవితం ఆధారంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రధాన పాత్రలో సినిమా మొదలయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం గురించి, అందులో తన పాత్ర గురించి పవన్ మాట్లాడుతూ” సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో నటించడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. “పుష్పకవిమానం”, “విచిత్ర సోదరులు”, “ఆదిత్య 369″ లాంటి సినిమాలు ఆయన ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని అనిపించింది. అందుకే ఈ సినిమా పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టాను.
ఆరు నెలల క్రితం మా అబ్బాయి ‘అకీరా’ ఆడుతూ కింద పడిపోయాడు. వాడి మోకాలు మీద చిన్న దెబ్బ తగిలింది. దానికే ఒక తండ్రిగా నేను ఎంతో విలవిల్లాడిపోయాను. ఆ క్షణంలో నాకు మేరీ మాట గుర్తుకు వచ్చారు. మరి ఏసు క్రీస్తుని 33 ఏళ్ళకే శిలువ వేస్తుంటే ఆ తల్లి హృదయం ఎంతగా కుమిలిపోయుంటుందో కదా అని అనిపించింది. ఆది నా మనసులో చాలా బలంగా నాటుకుని పోయింది. ఇది జరిగిన కొన్నాళ్లకు కొండ కృష్ణంరాజు నా దగ్గరకొచ్చి ఈ కథ చెప్పారు. న మనసుకి చాలా దగ్గరున్న పాత్ర కావడంతో నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇందులో నా పాత్ర ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రతి ఒక్కరికీ ప్రేమతత్వం బోధించే చిత్రమవుతుంది. ఇరవై ఐదు రోజుల పాటు నేను ఈ చిత్రం షూఓటింగులో పాల్గొంటాను. ఇమెజ్‌తో సంబంధం లేకుండా ఎవరు వైవిధ్యభరితమైన కథలను తీసుకొచ్చినా..నాకు నచ్చితే వెంటనే చేస్తాను” అని అన్నాడు.
Pages:



