త్వరలో “భైరవ” విడుదల…
Thu, Sep 2 2010
రియల్ స్టార్ డా:శ్రీహరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “భైరవ” చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర పనులను దాదాపు పూర్తి చేసుకుంది. ప్రస్తుతానికి తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఈ నెల సెప్టెంబరు 10 వ తేదీన విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.
ఈ చిత్ర దర్శకుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ” వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని సెప్టెంబరు 10 కల్లా “భైరవి” ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. ఇందులో శ్రీహరి రౌడీల్లో మార్పు తీసుకొచ్చే ఒప్క పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు” అన్నాడు.
సింధూ తులానీ ఈ చిత్రంలో శ్రీహరి సరసన కథానాయికగా నటిస్తోంది. యమ్.యమ్. శ్రీలేఖ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో తనికెళ్లభరని, జీవ, ఉత్తేజ్, సుప్రీత్, అజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Pages:



