అభిమానులందరికీ సారీ:రజినీకాంత్


సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య వివాహం రేపు (సెప్టెంబరు౩) న చెన్నైలోని మెయ్యమ్మ ఫంక్షన్ హాలులో ఘనంగా జరగబోతోంది. ఈ సందర్భంగా తన అభిమానులందరికీ రజినీ క్షమాపణలు చెప్పాడు. అదేంటి…ఆయన కూతురు పెళ్లి జరుగుతుంటే… అభిమానులకు రజినీ క్షమాపణలు ఎందుకు చెప్పినట్టు అనుకుంటున్నారా…అయితే ఇది పూర్తిగా చదవండి.

“నా కుమార్తె పెళ్ళికి సోనియాగాంధీ, కరుణానిధి, అమితాబ్ బచ్చన్, జయలలిత, మరెందరో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నందున.. ట్రాఫిక్ మరియు సెక్యూరిటీ సమస్యలు తలెత్తకూడదనే నా అభిమానులను పెళ్ళికి    ఆహ్వానించలేకపోతున్నాను…క్షమించండి” అంటూ రజినీ మీడియా ద్వారా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు. అదండీ సంగతి….!

అభిమానులంటే రజినీకి పంచ ప్రాణాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే…ఎంతైనా..తన వ్యక్తిగత కార్యక్రమానికి ఆహ్వానించలేకపోతున్న కారణంగా అలా బహిరంగంగా అభిమానులకు క్షమాపణ చెప్పడం బహుశా రజినీకి మాత్రమే సాధ్యమేమో….?


Pages:

6,607 Responses to “అభిమానులందరికీ సారీ:రజినీకాంత్”

  1. anjaneyulu says:

    Dont worry sir, we can understand your feelings.

Leave a Reply