పోకిరి కోసం జల్సారాయుడిని వదులుకుంటుందా?


“కొన్ని కావాలనుకుంటే కొన్నివదులుకోవాలి తప్పదు….” ఈ నానిపోయిన సినిమా డైలాగ్ గోవా సుందరి ఇలియానాకి బాగా అతికినట్టు సరిపోతుందేమో. ఎందుకంటే.. హిందీ సూపర్ హిట్ సినిమా “లవ్ ఆజ్ కల్” తెలుగు రీమేక్ జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న సంగతి విదితమే. ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయికగా ఇలియానాని తీసుకున్నారు. అయితే, ఈ అమ్మడు శంకర్ రూపొందిస్తోన్న “3 ఇడియట్స్” తెలుగు వెర్షన్ కి కథానాయికగా ఎంపికయ్యింది. అందుకుగాను శంకర్ ఇలియానాని ఎక్కువ డేట్స్ అడగటం మూలాన, జయంత్ సి. పరాన్జీ “ఖుషీగా”(పేరు పరిశీలనలో ఉంది) సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేక అందులో నటించే అవకాశం ఇలియానా వదిలేసుకోబోతోందని వినికిడి. అటు మహేష్ తో “పోకిరి” , ఇటు పవన్ తో “జల్సా” లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఇలియానాకి నిజంగా ఇదొక తలనొప్పే అని పరిశ్రమ వర్గాల  గుసగుస.

అదలా ఉండగా.. పవన్ సినిమా నుండి ఇలియానా దాదాపు తప్పుకున్న నేపధ్యంలో ఆ చిత్ర దర్శక నిర్మాతలు ఇలియానా స్థానంలో త్రిష ని ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సింగీతం శ్రీనివాసరావు సినిమా షూటింగ్ నిమిత్తం పవన్ మరి కొద్ది రోజుల్లో హైదరాబాదుకి రానుండటంతో తుది నిర్ణయం పవన్ కే వదిలేయాలని జయంత్ భావిస్తున్నాడట. మరి పవన్ ఆలోచన ఏమయ్యుంటుందో అని….పరిశ్రమలో ఒకింత ఆసక్తి నెలకొంది…చెన్నై చంద్రం త్రిషకి  పవన్ సినిమాలో నటించేందుకు “ద్వారములు’ తెరుచుకుంటాయో లేక ,’ఉత్తరం’ నుండి ఏ తారో దిగుమతైపోతుందో…కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది…


Pages:

Leave a Reply