వాళ్ళు అసలు-ఆమె కొసరు
Fri, Sep 3 2010
అందాల ఛార్మీ ఎట్టకేలకు మరొక తెలుగు సినిమా తన ఖాతాలో వేసుకుంది. నాగ్, ప్రియమణి , అనుష్క హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న “రగడ” లో ఒక ప్రత్యేక పాత్రను ఛార్మీ పోషిస్తోంది. అంతే కాకుండా ఒక పాటలో కూడా ఈ ముద్దుగుమ్మ కనిపించబోతోందని సమాచారం. చిన్న పాత్రే అయినా ప్రాముఖ్యమున్న పాత్ర కావడంతో ఛార్మీ ఈ సినిమా లో నటించడానికి అంగీకరించింది అని టాలీవుడ్ టాక్.
ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న “రగడ” కి వీరు పోట్ల (బిందాస్ ఫేం )దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో అనుష్క, ప్రియమణి ‘అసలు’ కథానాయికలు కాగా, ‘కొసరు’ అందాలను కొసరి కొసరి వడ్డించగా పంజాబీ పడుచు మందారం ఛార్మీ కూడా సిద్ధమైపోవడంతో అభిమానులకు ఇక కను”విందు’”భోజనం ఖాయమే సుమీ…..! ఎనీ డౌట్స్ …..?
Pages:



