అక్కడ “ఇడియట్స్” ఇక్కడ “రాస్కెల్స్” ?



అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో మొన్నామధ్యన విడుదల సంచలన విజయాన్ని సాధించిన “3 ఇడియట్స్” చిత్రాన్ని తమిళ్, తెలుగు భాషల్లో ప్రముఖ దర్శకుడు శంకర్ రీమేక్ చేయనున్నాడు అన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఆ ముగ్గురు ఇడియట్స్ గా ఎవరు నటిస్తున్నారు అన్న దాని పైన మీడియాలో ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. టాలీవుడ్ తాజా గుసగుసల సారాంశం ఏమిటంటే..ఇప్పుడా సినిమా టైటిల్ ని “ఇడియట్స్” స్థానంలో రాస్కెల్స్ అని పెట్టనున్నట్టు సమాచారం.

ఈ విషయమై శంకర్ ఇప్పటి వరకైతే ఏమీ నోరు మెదపలేదు. ప్రస్తుతం “రోబో” సినిమాతో క్షణం తీరిక లేకుండా ఉన్న శంకర్ “3 ఇడియట్స్” రీమేక్ పై అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నయై అని అటు కోలీవుడ్ , ఇటు టాలీవుడ్ లో ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే…ఆ ప్రకటన “రోబో” విడుదల అయిన  తరువాత మాత్రమే వచ్చే అవకాశం ఉందని సమాచారం.


Pages:

Leave a Reply