ఆయన నాకు గురువు:తమన్నా


పాలబుగ్గల అందాల తమన్నా ఇటు టాలీవుడ్ లో, అటు కోలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతోంది. చాలామంది యువ దర్శకులకి నేడు తాను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తనకిష్టమయిన దర్శకులంతా తనకు గురువులతో సమానం అని చెబుతోందీ చిన్నది.

“ప్రతి మనిషికి తన జీవితంలో ఒక గురువు అవసరం ఉంటుంది. ఏది తప్పో, ఏది ఒప్పో.. ఏ దారి సరైనదో చెప్పడానికి, ఉన్నతమయిన వ్యక్తులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి గురువు చూపే దారి ఎంతో ముఖ్యం. వృత్తిపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ అలాంటి గురువుల మార్గదర్శకాలు ప్రతి మనిషి జీవితంలో ఎంతో అవసరం. అదృష్టం కొద్దీ నాకు నేను పనిచేసిన కొంతమంది దర్శకుల రూపంలో గురువులు ఉన్నారు. బాలాజీ శక్తివేల్, శేఖర్ కమ్ముల, లింగు స్వామి, ‘జయం’ రాజా లని నేను నా గురువులుగా భావిస్తాను. వాళ్ళందరూ ఎంతో ప్రతిభ గల దర్శకులు. వాళ్ళ దగ్గర నుండి నేనెన్నో విషయాలు నేర్చుకున్నాను” అంటోంది ఈ ముద్దుగుమ్మ.

నేర్చుకోగానే సరిపోదు కదా…ఆచరణలో పెడితేనే నేర్చుకున్న పాఠాలకి విలువ ఉండేది…!ప్రస్తుతం తెలుగులో  ‘అల్లు’ అర్జున్ సరసన “బద్రీనాధ్” ,నాగఛైతన్య తో మరో సినిమా…అలాగే తమిళంలో మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్న తమన్నాని చూస్తుంటే గురువుల మాట తు.చ తప్పకుండా పాటిస్తున్నట్టే ఉంది కదూ?


Pages:

Leave a Reply