స్విస్ అందాల నడుమ ఎన్టీఆర్
Mon, Sep 6 2010
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “బృందావనం” షూటింగ్ నిమిత్తం స్విట్జర్లాండ్ లో ఉన్నాడు. అక్కడి అందాలను తనివి తీరా ఆస్వాదిస్తున్న ఎన్టీఆర్ తాజాగా “ట్విట్టర్” లో… ” ఆహా.. స్విట్జర్లాండ్ ఎంత బాగుందో. ఇక్కడ మొదటి రోజు షూటింగ్ అయింది ఈ రోజు. నాలుగోసారి నేను ఇక్కడికొచ్చాను కానీ…ఇప్పటికీ మొదటిసారే వచ్చినట్టుంది నాకు.
ప్రస్తుతం “బృందావనం” సినిమాలోని నాకెంతో ఇష్టమయిన పాటని చిత్రీకరిస్తున్నాం. సినిమాలో ఆ పాట “నిజమేనా…” అంటూ మొదలవుతుంది. ఇక్కడ ఇంటర్లేకన్ అనే ప్రదేశంలో షూటింగ్ చేస్తున్నాం. ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా , ఆహ్లాదంగా ఉంది” అని ట్వీట్ చేశాడు.
Pages:



