అన్నపూర్ణ సాక్షిగా ఆడుతున్న”అతడు”


ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “మహేష్ ఖలేజా” సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని “అన్నపూర్ణ” స్టూడియోస్ లో జరుగుతోంది. “మకతిక మాయా మశ్చీంద్ర.. మనసిక మస్తీ కిష్కింద…” అనే పాటని మహేష్, అనుష్క మరియు కొంత మంది గ్రూప్ డ్యాన్సర్ల మీద చిత్రీకరిస్తున్నారు. అక్కడే మరో మూడు రోజులు చిత్రీకరణ జరుపుకున్నాక, ఒక రోజు రామోజీ ఫిలిం సిటీ లో జరిగే చిత్రీకరణతో ఆ పాట పూర్తవుతుంది.

మరోవైపు నిర్మాణాంతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరో కొద్ది రోజుల్లో “మహేష్ ఖలేజా” ఆడియో విడుదల కానుండగా, ఇదే నెల సెప్టెంబరు 30 న చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. “కనకరత్న మూవీస్” పతాకంపై సింగనమల రమేశ్ బాబు, సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ తో గతంలో “అతడు” లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్నిచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు.


Pages:

Leave a Reply