సెప్టెంబరు 12న “బృందావనం” ఆడియో విడుదల
Tue, Sep 7 2010
నందమూరి యంగ్ టైగర్ అభిమానులకి శుభవార్త. ఎన్నో ఊహాగానాలకు తెరదించుతూ ఎట్టకేలకు “బృందావనం” ఆడియో విడుదల తేదీ ఖారారయ్యింది. ఈ నెల సెప్టెంబరు 12 వ తేదీ. ఆదివారం హైదరాబాదులోని శిల్పకళా వేదిక లో వైభవంగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట తో “బృందావనం” కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరుకానున్నారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు కాజల్ అగర్వాల్, సమంత లు కథానాయికలుగా నటిస్తున్నారు. అందమయిన ప్రేమ క్తా చిత్రంగా “బృందావనం” రూపొందుతోంది అని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
Pages:



