సెప్టెంబరు నెలాఖరుకి “రోబో” విడుదల
Tue, Sep 7 2010
“సన్ పిక్చర్స్” పతాకంపై సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా అగ్ర దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న భారీ చిత్రం “రోబో” తెలుగు హక్కులను పశ్చిమగోదావరి జిల్లా యార్నిగూడెం కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, ‘శ్రీకృష్ణ ట్రేడర్స్ ” అధినేత తోట కన్నారావు తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ” భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబడ్డ “రోబో” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందు కు తెచ్చే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పటినుంచో తెలుగు సినీ రంగంలోకి రావాలని అనుకుంటున్నా కానీ, ఏదైనా మంచి భారీ సినిమాతో రావాలని ఇన్నాళ్లు ఆగాను. ఇప్పుడు “రోబో” రూపంలో నా కోరిక నెరవేరబోతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. శంకర్, రజినీ కాంత్, రెహమాన్ త్రయం ఒకవైపు, దేనికీ రాజీ పడకుండా నిర్మించగల సత్తా ఉన్న “సన్ పిక్చర్స్” లాంటి భారీ చిత్రాల నిర్మాణ సంస్థ ఒకవైపు ఉండటం నన్ను ఈ చిత్రం తెలుగు హక్కులను తీసుకునేందుకు ప్రేరణగా నిలిచాయి. శంకర్ , రజినీ కాంత్ కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన “శివాజీ” కంటే కూడా ఈ “రోబో” మరెన్నో సంచలనాలు సృష్టించబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పాటలని, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని నేను ఇప్పటికే చూశాను. అద్భుతంగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకుల ముందుకి “రోబో”ని ఈ నెలలోనే తీసుకూరాబోతున్నాము అని తెలియజేసెందుకు మేం సంతోషిస్తున్నాం” అన్నారు.
కళానిధి మారన్ నిర్మించిన “రోబో” చిత్రానికి, ఫోటోగ్రఫీ: రత్నవేలు, మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: భువానచంద్ర, సుద్దాల అశోక్ తేజ, వనమాలి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శంకర్.
Pages:



