“……కొడతారా……పడతారా…..” అంటున్న మనోజ్
Tue, Sep 7 2010
వరుస చిత్రాల విజయాలతో మాంఛి ఊపు మీదున్న మంచు మనోజ్, “ఝుమ్మంది నాదం” తరువాత ఏ సినిమాని ఇంతవరకు ఒప్పుకోలేదు. తన భుజంలో కలుగ్తున్న నొప్పే అందుకు కారణం. “బిందాస్” సినిమా చేస్తున్న సందర్భంలో ఒక యాక్షన్ సీన్ సందర్భంగా గాయపడ్డ మనోజ్, ఇప్పటికీ ఆ భుజం నొప్పి బారి నుండి బయటపడలేకపోయాడు. అందుకే ఇక లాభం లేదనుకుని లాస్ ఏంజెల్స్ లోని ఒక ప్రముఖ స్ర్జన్ దగ్గర తన భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం మనోజ్ వేగంగానే కోలుకుంటున్నాడు.
అదలా ఉండగా, మనోజ్ తన తదుపరి చిత్రం “ఊ కొడతారా…ఉలిక్కి పడతారా? లో మరొక భిన్నమయిన పాత్రని పోషించనున్నాడని వినికిడి. తాజా సమాచారం ప్రకారం, అంతా సవ్యంగా జరిగితేఅక్టోబరు ౧ నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. రాజా అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నాడు
Pages:



