‘ఆ ఇద్దరూ’ అక్కడున్నారట…..!


స్టైలిష్ స్టార్ ‘అల్లు’ అర్జున్, పాలబుగ్గల తమన్నా ఇద్దరూ జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో “బద్రీనాధ్” అనే సినిమా లో నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన కొన్ని  ముఖ్యమయిన సన్నివేశాలని మనాలీలోని ఒక అందమయిన ప్రదేశంలో ప్రకాష్ రాజ్, ‘అల్లు’ అర్జున్, తమన్నా మీద చిత్రీకరిస్తున్నారు.

‘అల్లు’ అర్జున్ కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఆళ్ళు అరవింద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. చిన్ని కృష్ణ కథ అందించిన ఈ చిత్రంలోని పీటర్ హెయిన్స్ కూర్చిన పోరాట సన్నివేశాలు హైలైట్ అవుతాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. వినాయక్ తో బన్నీ కాంబినేషన్‌లో గతంలో “బన్నీ”అనే సినిమా వచ్చింది. అలాగే…అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి సినిమాకి చిన్ని కృష్ణ కథను అందించారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న “బద్రీనాధ్” ని ఎలా చూపించబోతున్నారో అని అటు అభిమానుల్లోనూ…ఇటు టాలీవుడ్ లోనూ ఆసక్తి నెలకొంది.


Pages:

Leave a Reply