“మర్యాద రామన్న” అర్ధశతదినోత్సవం


“ఆర్క మీడియా వర్క్స్” పతాకంపై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన “మర్యాద రామన్న” సెప్టెంబర్ 10 కి అర్ధ అర్ధశతదినోత్సవం జరుపుకుంటుంది. యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హేరోగా వచ్చిన ఈ సినిమా ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మాట్లాడుతూ” ,”మర్యాద రామన్న” చిత్రం ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో 123 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకుని దిగ్విజయంగా మంచి  కలెక్షన్స్ తో శతదినోత్సవం వైపు పరుగులు తీస్తోంది. మా సంస్థకు ఇంత మంచి హిట్ ఇచ్చిన దర్శకులు రాజమౌళి గారికి, ఎమ్.ఎమ్.. కీరవాణి గారికి, హీరో సునీల్ కి…ఆ చిత్ర యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే “మర్యాద రామన్న’ ని ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులకు కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం” అన్నారు.


Pages:

Leave a Reply