ఆయన వస్తానంటే..నేను ఆగిపోతా……?


సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా సినిమా “రోబో” పై అందరికీ భారీ అంచనాలున్నాయి. కొన్ని సినిమాలు కొంతమంది హీరోలు, దర్శక నిర్మాతలు తమ సినిమాల విడుదలని వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా చేరాడు.  సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “దబంగ్” చిత్రం ఈ నెలాఖరుకి విడుదల కావలసి ఉంది. అయితే.. మరోపక్కన రజీనీకాంత్ తాజా చిత్రం “రోబో” కూడా అదే సమయానికి విడుదలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో ఎందుకొచ్చిన రిస్క్ అంటూ… సల్మాన్” రజినీ కాంత్ గారి సినిమా ఒకవేళ నా చిత్రం విడుదల సమయంలోనే వస్తున్నట్టయితే నా సినిమా ‘దబంగ్’ ని వాయిదా వేసుకుంటున్నాను” అని అంటున్నాడు

అసలే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా కావడం వల్ల, మీడియాలో కూడా “రోబో” పట్ల హైప్ చాలా ఎక్కువగా క్రియేట్ అయ్యింది. అందువల్లే.. చాలామంది తమ చిత్రాలని ఒక్కొక్కరూ వాయిదాలు వేసుకుంటూ పక్కకు తప్పుకుంటున్నారు. మరి ఇన్ని అంచనాల నడుమ విడుదలవుతున్న “రోబో” అభిమానులని ఏమాత్రం అలరిస్తాడో వేచి చూడాల్సిందే.


Pages:

Leave a Reply