రామానాయుడిని వరించిన “దాదా సాహెబ్”


మూవీ మొఘల్ గా పరిశ్రమలో అందరి చేత ముద్దుగా పిలిపించుకునే డా:డి రామానాయుడుని తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. దాదాపు ఐదు దశాబ్దాల నుండి సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేషమయిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమయిన అవార్డుతో రమానాయుడు ని గౌరవించింది. గత సంవత్సరం(2009) నికి గాను రామానాయుడు ఈ  అవార్డును అక్టోబరు నెలలో జరిగే జాతీయ సినీ అవార్డుల కార్యక్రమంలో భారత ప్రభుత్వం చేతుల మీదుగా అందుకుంటారు. ఈ అవార్డులో భాగంగా రమానాయుడుకి ప్రభుత్వం ఒక బంగారు కమలం ఉన్న మెడల్, పది లక్షల నగదు బహుమతి  ని అందజేస్తుంది.

దాదాపు పధ్నాలుగు భాషల్లో సినిమాలను నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించిన రామానాయుడు, సుమారుగా 130 సినిమాలకు పైగానే నిర్మించారు. హైదరాబాదుతో పాటు, విశాఖపట్నం లలో  రామానాయుడు కి అన్ని వసతులున్న ఆధునికమయిన స్టూడియోలు ఉన్నాయి.

“దాదా సాహెబ్ ఫాల్కే ” అవార్డును పొందిన శుభ సందర్భంలో రామానాయుడుకి మాస్టార్స్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.


Pages:

Leave a Reply