తెలుగు ప్రేక్షకులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు : ఇలియానా


ఉన్నావా…అసలున్నావా ! ఉంటే కళ్లు మూసుకున్నావా…ఈ లోకం కుళ్లు చూడకున్నావా’ అని దేవుణ్ని అనవసరంగా ఆడిపోసుకుంటాం కానీ…ఆయన లేనిదే ఈ లోకం, చరాచర జగత్తులన్నీ ఎలా నడుస్తాయి ! చెప్పండి…దేవుడున్నాడు. మనిషికి మళ్లీ ఇంకో జన్మ కూడా ఉంటుంది’ అని అందాల తార ఇలియానా పెద్ద పెద్ద విషయాలు చెప్పేస్తోంది. దీనికి కారణం క్రిస్‌మస్‌. ఈ పండుగ వచ్చిందంటే ఇలియానాలో ఫుల్‌ జోష్‌ కనిపిస్తుంది. ఇలియానాకు ఏసుక్రీస్తు అంటే అపారమైన నమ్మకం. చిన్నతనం నుంచీ బైబిల్‌ పట్ల ఎంతో మక్కువ చూపించిన ఇలియానా, డిసెంబర్‌ 25న పండుగ హడావిడి అంతా తనదేనట.

ఇలూ ఏమందంటే…’స్కూల్‌డేస్‌ నుంచీ ఈ అలవాటు ఉంది. ఇప్పుడంటే సినిమాలతో ఖాళీ దొరకడం లేదు కానీ…స్కూల్‌, కాలేజ్‌ డేస్‌లో క్రిస్మస్‌కు 10 రోజుల ముందు నుండే ప్రిపరేషన్స్‌ చేసేదాన్ని. గోవాలో ఉన్న క్యాథలిక్‌ చర్చిలో పండుగ చేసుకునే మేము, ఇంట్లో కూడా అంతే సందడి చేస్తాం. ముఖ్యంగా ఈ పండుగ వేళ క్రిస్టియన్స్‌ 10 రోజుల ముందే ఇంటికి స్టార్‌ కడతారు. అలాంటి స్టార్స్‌లో రోజుకో కొత్త కలర్‌ వచ్చేలా బల్బ్‌లు మార్పించేదాన్ని. పండక్కి కనీసం నాలుగు జతల బట్టలు కొనిపించేదాన్ని. ఇక క్రిస్మస్‌ ‘ట్రీ’ కోసం అయితే నేను ఫ్రెండ్స్‌తో కలిసి రూరల్‌ ప్రాంతాలకు వెళ్లి ఓక్‌ చెట్టు కొమ్మల్ని కట్‌ చేసి ఇంటికి తెచ్చి అలంకరించి..దానికి బల్బ్‌ పెట్టేదాన్ని.

సినిమాల్లో నేను పాటలు పాడకపోయినా, చర్చిలో పాడే కోరస్‌లో కరెక్ట్‌ టైమింగ్‌తో పాడతాను. క్రిస్మస్‌ డిన్నర్‌కి ముందే పొద్దుట నుండీ ఏదో ఒకటి తినేస్తుండటం వల్ల డిన్నర్‌ టైంలో ఢలాీపడిపోయేదాన్ని. ఓసారి మా ఇంట్లో రోజు డ్యాన్స్‌ కూడా చేశాను. ఇలా ఎన్నో మధురానుభూతులు నామదిలో ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు. మీరు కూడా ఆనందంగా గడపండి’ అని ముగించింది.


Pages:

Leave a Reply