మొదటి ప్రాధాన్యం దానికే-శ్రుతి


‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది శ్రుతీహాసన్. ఆ తరువాత ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంలో నటించింది. అటు తమిళంలో ‘ఏళామ్ అరివు’ సినిమాలో సూర్యతో కలిసి నటించి కోలీవుడ్‌కి పరిచయమైంది. ఈ చిత్రం తెలుగులో ‘సెవెన్త్ సెన్స్’ పేరుతో విడుదలై శ్రుతీకి మంచి పేరు తెచ్చింది. ప్రస్తుతం శ్రుతీ తమిళంలో ధనుష్ సరసన ‘త్రీ’ చిత్రంలోనూ, తెలుగులో పవన్‌తో కలిసి ‘గబ్బర్‌సింగ్’ సినిమాలోనూ నటిస్తోంది. ఆ మధ్య ఎన్టీఆర్ చిత్రానికి కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఆ సినిమా అవకాశాన్ని చేజార్చుకున్నందుకు ఎంతో బాధపడుతున్నా అని కూడా చెప్పింది. ప్రస్తుతం తమిళంలో ‘త్రీ’ సినిమా తప్ప ఇప్పటి వరకు ఏ చిత్రానికి సంతకం చేయలేదట ఈ చెన్నై సోయగం. ఎందకని ప్రశ్నిస్తే “నేను చెన్నైకి చెందినా, అవకాశాలు మాత్రం తెలుగులోనే ఎక్కువగా వచ్చాయి. ఇప్పటి వరకు తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో ఒక సినిమా చేశానంటే… టాలీవుడ్‌కి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నానో అర్థమవుతుంది. నా మొదటి ప్రాధాన్యం దానికే. ఇక్కడ నాకు బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని” అంటోంది శ్రుతి


Pages:

Leave a Reply