నా లిస్ట్ చాలా పెద్దది-రిచా
Tue, Dec 27 2011
లీడర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది రిచాగంగోపాధ్యాయ. ‘మిరపకాయ్’ ‘నాగవల్లి’లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. అయినా టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే శింబు సరసన ‘ఒస్తి’లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇది హిందీలో విడుదలైన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్. అలాగే విజయ్ సరసన ఓ చిత్రంలో నటించింది. ఈ రెండు సినిమాలు రిచాకి అక్కడ మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది ఈ అమ్మడు.
రాబోయే కొత్త సంవత్సరం సందర్భంగా ఎలాంటి రిసొల్యూషన్స్ తీసుకుంటున్నారని రిచాని ప్రశ్నిస్తే… “ఈ ఏడాది నాకు మంచి జ్ఞాపకాల్నే మిగిల్చింది. తమిళంలో రెండు సినిమాల్లో నటించా. తెలుగులో మరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. కాబట్టి నా క్యాలెండర్‌లో 2011కి మంచి స్థానం ఉంది. వచ్చే ఏడాది రిసొల్యూషన్స్ గురించి అంటారా… చాలానే ఉన్నాయి. ఆ లిస్ట్ చాలా పెద్దదే. ఓ పదిహేను దాకా ఉన్నాయి. అది ఏంటనేది మాత్రం ఇప్పుడే చెప్పను” అంటోంది.
Pages:



